శుక్రవాహిక

శుక్రవాహికలు (ఆంగ్లం: Vas deferens; లాటిన్: "carrying-away vessel") పురుష జననేంద్రియ వ్యవస్థలో వృషణాలలోని ఎపిడిడైమిస్ నుంచి మొదలైన పొడవైన, కండరయుత నాళాలు. ఇరువైపుల నుంచి బయలుదేరిన శుక్రవాహికలు వాంక్షణకుల్యల ద్వారా ఉదరకుహరంలోకి ప్రవేశించి, మూత్రనాళాలను చుట్టి, వెనుకకు వ్యాపించి శుక్రకోశంలోకి తెరచుకొంటాయి.

శుక్రవాహిక
పురుష జననేంద్రియ వ్యవస్థ
వృషణాలు, నిలువు కోత శుక్రవాహికలను చూపిస్తుంది.
గ్రే'స్ subject #259 1245
ధమని Inferior vesical artery, Artery of the ductus deferens
లింఫు external iliac lymph nodes, internal iliac lymph nodes
Precursor Wolffian duct
MeSH Vas+Deferens

నిర్మాణం

శుక్రవాహికలు రెండు కుడి మరియు ఎడమ ఎపిడిడైమిస్ ల నుండి శుక్ర కణాల్ని తరళించడానికి ఉపయోగపడతాయి. మనుషులలో ఒక్కొక్కటి సుమారు 30 సెంటీమీటర్ల పొడవు ఉండి నునుపు కండరాలు కలిగివుంటాయి. లోపలివైపు స్థూపాకార కణజాలపు మ్యూకస్ పొర కప్పివుంచుతుంది. ఇవి రెండు స్పెర్మాటిక్ కార్డ్ లో ఒక భాగము.

వాసెక్టమీ

కుటుంబ నియంత్రణ పద్ధతులలో ఒక శాశ్వతమైన పద్ధతి వాసెక్టమీ. ఈ విధమైన శస్త్రచికిత్సలో రెండు వైపులా శుక్రవాహికలలో చిన్న భాగాన్ని కత్తితించి తొలగిస్తారు. కొన్ని ఆధునిక పద్ధతులలో శుక్రవాహికలోనికి ప్రవాహాన్ని నిరోధించే పదార్ధాలను లోపలికి పంపిస్తారు. అన్ని పద్ధతులలోనూ వీని ముఖ్య ఉద్దేశం శుక్రవాహికలలో వీర్యం యొక్క ప్రవాహాన్ని నిరోధించి, వీర్యకణాలు బయటికి రాకుండా చేయడము.

మూలాలు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.