వృషణం

మానవులలో పురుష జననేంద్రియాలు సంస్కృతంలో- వృషణాలు లేదా ముష్కాలు (ఆంగ్లం: Testis) . స్త్రీలలో అండకోశాలవలె పురుషులలో వీర్య కణాలు ఇందులో తయరవుతాయి. ఇవి రెండు ఒక చర్మపు సంచి (ముష్క కోశం) లో పురుషాంగము క్రింద మానవుని శరీరం వెలుపల వ్రేలాడుతూ ఉంటాయి. వృషణాలు మనిషి శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువగా ఉంటే సరిగా పనిచేస్తాయి. అందుకే యీ ఏర్పాటు చేయబడింది. అన్ని సకశేరుకాలలో ఇవి ఉదరములో ఉంటాయి.

వృషణం (Testicle)
Inner workings of the testicles.
Diagram of male (human) testicles
లాటిన్ testis
గ్రే'స్ subject #258 1236
ధమని Testicular artery
సిర Testicular vein, Pampiniform plexus
నాడి Spermatic plexus
లింఫు Lumbar lymph nodes

నిర్మాణం

వృషణాలు ఒక్కొక్కటి 14 - 35 చదరపు సె.మీ. పరిమాణంలో ఉంటాయి. ప్రతి ముష్కములో అనేక సంఖ్యలో శుక్రోత్పాదక నాళిక (Semeniferous tubules) లను కలిగివుండి వాటి మధ్యలో మధ్యాంతర కణాలు లేదా లీడిగ్ కణాలు (Leydig cells) ఉంటాయి. ముష్కాలలోని నాళికల నుండి శుక్ర కణాలు (Spermatozoa) తయారౌతాయి. లీడిగ్ కణాలు పురుష హార్మోను టెస్టోస్టిరోన్ (Testosterone) స్రవిస్తాయి.

వృషణాల ధర్మాలు

వృషణాలు పురుష జననేంద్రియ వ్యవస్థలో భాగంగా మరియు వినాళ గ్రంధులుగా పనిచేస్తాయి.

  • ప్రత్యుత్పత్తి ప్రధానమైన శుక్ర కణాలు (spermatozoa) తయారుచేస్తాయి.
  • పురుష సెక్స్ హార్మోన్లు, ముఖ్యంగా టెస్టోస్టిరోన్ తయారుచేస్తాయి.

ఈ రెండు ధర్మాలు పియూష గ్రంధి నుండి విడుదలయ్యే గొనడోట్రోపిక్ హార్మోన్లు మీద ఆధారపడి తయారౌతాయి.

వృషణాల వ్యాధులు

వృషణాలు బయట ఉండడం మూలంగా దెబ్బలు తగలడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉండి నరాల ద్వారా కడుపులోనికి వెళ్తుంది.

  • వేరికోసిల్ : వృషణాల సిరల వాపు.
  • క్షయ మరియు ఫైలేరియా క్రిముల మూలంగా వృషణాలు వాచి నొప్పి వస్తుంది.
  • వృషణాల కాన్సర్ ఎక్కువగా యువకులలో వస్తుంది. ఇది చాలా ప్రమాదమైనది.
  • స్పెర్మాటిక్ కార్డ్ మరియు వృషణాలు తాడులాగా మడతపడితే టార్షన్ (Torsion) అంటారు.
  • స్పెర్మాటిక్ కార్డ్ లోని రక్త నాళాలు ఉబ్బి రక్తం నిలిచిపోవడాన్ని వేరికోసీల్ (Varicocele) అంటారు.[1]
  • క్రిప్టార్కిడిజమ్ (Cryptorchidism) అనగా వృషణాలలో ఒకటి గాని రెండు గాని బయటకు కనిపించకుండా ఉండడం. పిండాభివృద్ధిలో వృషణాలు క్రిందికి దిగడంలో అవాంతరం ఏర్పడినప్పుడు అవి కడుపులో గాని, గజ్జలలో గాని ఆగిపోవచ్చును. సుమారు 3 శాతం పూర్తిగా అభివృద్ధి చెందిన శిశువులలో మరియు 30 శాతం పాక్షికంగా అభివృద్ధి చెందిన శిశువులలో ఈ విధమైన లోపం కనిపిస్తుంది. ఇందువలన జననేంద్రియాలలో జన్మతహా వచ్చే లోపాలలో ఇది అతి సాధారణమైనది. అయితే బాగా అరుదుగా కొందరిలో వృషణాలు పూర్తిగా లేకపోవచ్చును. దీనిని ఎనార్కియా (Anorchia) అంటారు.
  • వరిబీజం, వృషణాల పరిమాణము పెరుగుదల

చిత్ర మాలిక

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.