తొడ

తొడ (Thigh) మన శరీరపు కాలు లోని భాగము. ఇది కటి ప్రాంతానికి మోకాలుకు మధ్య భాగం. తొడలోపల ఉండే ఒకే ఒక ఎముక తొడ ఎముక (Femur). ఇది మన శరీరంలోని అతి బలమైన ఎముక. ఇది కటి ప్రాంతంతోను క్రింది ముంగాలు తోను గట్టిగా కీళ్లతో సంధించబడి యుంటుంది.

తొడ
తొడ భాగము
MeSH Thigh
Dorlands/Elsevier t_09/12804725

నిర్మాణము

తొడ భాగం మూడు కంపార్ట్‍మెంట్లుగా విభజించబడి వాటి మధ్య బలమైన స్తితిస్తాపక పొరతో వేరుచేయబడి ఉంటాయి. ఒక్కొక్క విభాగానికి వేరువేరుగా రక్తము మరియు నరాల అమరిక ఉంటుంది. వీనిలో బలమైన కండరాలు ఉంటాయి.

  • Medial fascial compartment of thigh, adductor
  • Posterior fascial compartment of thigh, flexor, hamstring
  • Anterior fascial compartment of thigh, extensor

విశేషాలు

చిన్న పిల్లలకు పాఠశాలలో విధించే ఒక విధమైన శిక్ష (Punishment) తొడ పాశం.

కొంతమంది చేతితో తొడమీద కొట్టి మీసం మెలివేస్తారు. ఇదొక సవాల్ (Challenge) చేయడానికి ఉపయోగించే సంజ్ఞ.

స్థూలకాయం (Obesity) ఉన్నవారికి ముఖ్యంగా స్త్రీలకి తొడ పైభాగంలో ఎక్కువగా కొవ్వు చేరుతుంది.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.