జిడోవుడిన్

Zidovudine, జిడోవుడిన్ ( 1-[ (2R,4S,5S) -4-azido-5- (hydroxymethyl) oxolan-2-yl]-5-methylpyrimidine-2,4-dione[, AZT లేదా ZDV, brand name Retrovir®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించె nucleoside reverse transcriptase inhibitors (NRTIs) అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు AZT లేదా ZDV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 19-Mar-1987[1] రోజున అమోదించబడింది. HIV / AIDS పైన మానవులు సాధించిన మొట్టమొదటి విజయం. HIV చికిత్స కోసం కనిపెట్టబడిన మొట్టమొదటి ఔషధం.

మోతాదు ( Dosage )

Zidovudine టాబ్లెట్లను ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి వుంటుంది.. ఈ మందును పిల్లలు కూడా తీసుకొనవచ్చును. పరికడుపున కాని తిన్న తర్వాతగాని వెసుకొవచ్చు. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితో పాటుగా ఇదే తరగతికి చెందిన కనీసం ఒక మందును అలాగే NNRTI కి చెందిన ఒక మందుతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.HIV తొ ఉన్న పెద్దలకు డొస్ 300 mg రెండుసార్లు ప్రతిరోజు వేసుకొవాలి.

దుష్ప్రబావాలు (Side Effects )

ఎయిడ్స్
ఉపశమన మందులు
స్టావుడిన్
లామివుడిన్
జిడోవుడిన్
డిడనొసిన్
అబాకవిర్
టెనొఫవిర్
ఎంట్రిసిటబిన్
నెవిరపిన్
ఎఫావిరెంజ్
ఇండినవిర్
అటాజనవిర్
రిటనోవిర్
లొపినవిర్
డారునవిర్
నెల్పినవిర్
సాక్వినవిర్

ఈ దుష్ప్రబావాలు [2] (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.

  1. ఎముక మూలుగ సమస్యలు: ఎనిమియా ( రక్తంలో హొమొగ్లొబిన్ స్థాయి పడి పొవటం ), రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపొవటం లాంటివి. అలసట, అకలి మందగించటం, కళ్ళు పసుపు రంగులోనికి మారటం, చర్మం కాంతిని విహీనం కావటం, శ్వాస తీసుకొవటంలో ఇబ్బందులు దీని ప్రదాన లక్షణాలు.
  2. Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలో వస్తుంది. రక్తంలో Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాధారణంగా 0.50-2.20 mmol/L మధ్యలో వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులో నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలో ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలో Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
  3. Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహంలో కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్ఘకాలికంగా వాడినప్పుడు మాత్రమే వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలో ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
  4. Myopathy:చాల అరురుగా వస్తుంది.కండరాలకు (గుండెతో సహా) నష్టాన్ని చేకురుస్తుంది. Zidovudine ను దీర్ఘకాలికంగా వాడినప్పుడు మాత్రమే వస్తుంది.కండరాలలో నొప్పి దీని ప్రధాన లక్షణం.
  5. సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, కాళ్ళు చేతులు మొద్దుబారటం, ఎదలో కాలటం (Heartburn). ఇవ్వన్ని కొన్ని రోజుల్లో మాయమవుతాయి.

ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?

ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైన లివర్, కిడ్ని సమస్యలు వుంటె, ఇంతకు ముందు క్లొమ లోపం వచ్చివుంటె, అనిమియా వచ్చివుంటె, ఎర్రరక్తకణాలు తక్కువగా ఉంటె, ఇంతకు ముందు మీకు ఎప్పుడైన ఉన్నదానికంటె Lactate Levels ఎక్కువగా ఉండి ఉంటె, ఇంతకు ముందు Pheripheral Neauropathy (నరాల బలహీనత) ఇంతకు ముందు ఉండివుంటె.వీటిలో ఎదైన సమస్య ఉన్న వాళ్లు ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది

గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?

ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి C గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటె గర్బం లోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన మరియు కచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకొవటంలో సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. అలాగే బాలింత మహిళ పాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.