గర్భాశయము

గర్భాశయం లేదా గర్భకోశం (Uterus) స్త్రీ జననేంద్రియ వ్యవస్థలో అతి ముఖ్యమైన భాగం. ఇది కటి ప్రదేశం మధ్యభాగంలో మూత్రాశయంకు పెద్ద ప్రేగుకు మధ్యలో ఉంటుంది.

గర్బాశయం
గ్రే'స్ subject #268 1258
ధమని ovarian artery, uterine artery, helicine branches of uterine artery
లింఫు body and cervix to internal iliac lymph nodes, fundus to superficial inguinal lymph nodes
Precursor Müllerian duct
MeSH Uterus

గర్భాశయ ధర్మాలు

స్త్రీ గర్భం దాల్చిన తర్వాత ఫలదీకరణం చెందిన అండం ఇక్కడ పిండంగా మారి తొమ్మిదినెలలో దినదినాభివృద్ధిచెందిన శిశువు చివరికి పురుడు సమయంలో దీని బలమైన కండరాల ద్వారా బయటకు పంపించబడుతుంది.

గర్భాశయ నిర్మాణం

ఇది కటి ప్రదేశం మధ్యభాగంలో మూత్రాశయం మరియు పురీష నాళం లకు మధ్యలో ఉంటుంది. ఇది పియర్ ఆకారంలో ఉండే కండరాలతో చేయబడిన అవయవం.

భాగాలు

గర్భాశయాన్ని మూడు భాగాలుగా పేర్కొంటారు. ఫండస్, బాడీ మరియు సెర్విక్స్.

  • గర్భాశయ గ్రీవము (Cervix uteri - "neck of uterus")
    • External orifice of the uterus
    • Canal of the cervix
    • Internal orifice of the uterus
  • corpus uteri - "Body of uterus"
    • Cavity of the body of the uterus
    • Fundus (uterus)

పొరలు

గర్భాశయంలోని నాలుగు పొరలు లోపలి నుండి బయటకి:

ఎండోమెట్రియమ్ 
గర్భాశయపు లోపలి మ్యూకస్ పొరను ఎండోమెట్రియమ్ (Endometrium) అంటారు. చాలా క్షీరదాలలో ఈ పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్త పొర ఏర్పడుతుంది. దీనినే ఋతుచక్రం అంటారు. ఇవి స్త్రీలు గర్భవతులయ్యే కాలమంతా ఉండి, చివరికి బహిష్టు లాగిపోతాయి. ఈ చక్రం కొన్ని రోజుల నుండి ఆరు నెలల కాలం వరకు ఉండవచ్చును.
మయోమెట్రియమ్ 
గర్భాశయం ఇంచుమించు అంతా నునుపు కండరాలుతో మందంగా ఉంటుంది. దీనిని మయోమెట్రియమ్ (Myometrium) అని పిలుస్తారు. ఎడినోమయోసిస్ అనే వ్యాధిలో ఈ భాగం లావెక్కుతుంది.
పెరిమెట్రియమ్ 
మెత్తని ఆధార కణజాలంతో చేసిన బయటి పొరను పెరిమెట్రియమ్ (Perimetrium) అంటారు. గర్భాశయం బయటి వైపు పైభాగంలో పెరిటోనియమ్తో కప్పబడి ఉంటుంది. ఇది ఉదరపు పొరలతో కలిసి వుంటుంది.

ఆధారాలు

The uterus is primarily supported by the pelvic diaphragm and the urogenital diaphragm. Secondarily, it is supported by ligaments and the peritoneum (broad ligament of uterus) [1]

It is held in place by several peritoneal ligaments, of which the following are the most important (there are two of each):

NameFromTo
uterosacral ligamentthe posterior cervixthe sacrum of pelvis
cardinal ligamentsthe side of the cervixthe ischial spines
pubocervical ligament [1]

Other named ligaments near the uterus, i.e. the broad ligament, the round ligament, the suspensory ligament of the ovary, the infundibulopelvic ligament, have no role in the support of the uterus.

స్థానం

గర్భాశయం సాధారణంగా రెండు ప్రదేశాలలో ముందుకు వంగి ఉంటుంది. దీనిని "anteflexed" మరియు "anteverted." అంటారు. గర్భాశయం యోనితో చేయబడిన వంపు మొదటిది, ఫండస్ భాగం బాడీతో చేయబడిన వంపు రెండవది.

వ్యాధులు

  • గర్భాశయం జారడం
  • గర్భాశయ కాన్సర్ – malignant neoplasm
  • ఎక్టోపిక్ గర్భం
  • ట్యూమర్లులియోమయోమా
  • ఎడినోమయోసిస్ – ectopic growth of endometrial tissue within the myometrium
  • పయోమెట్రా – infection of the uterus, most commonly seen in dogs
  • గర్భాశయపు అంగవైకల్యాలు

మూలాలు

  1. The Pelvis University College Cork
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.