క్లోమము

క్లోమము (ఆంగ్లం: Pancreas) జీర్ణ వ్యవస్థకు చెందిన ఒక క్లిష్టమైన గ్రంథి. మనిషి ఉదరము పైభాగంలో అడ్డంగా 15-25 సె.మీ.ల పొడుగుంటుంది. దీనిని మూడు భాగాలుగా చేయవచ్చును. ఇది చిన్న ప్రేగు (ఆంత్రమూలము) ప్లీహము ల మధ్యలో ఉంటుంది. ఈ గ్రంథి రెండు విధులు ఉన్నాయి. వినాళ గ్రంధి విధులు, జీర్ణ వ్యవస్థలో ఎంజైములను తయారు చెయ్యడానికి ఉపయోగపడుతుంది. ఆల్ఫా, బీటా మరియు డెల్టా కణజలాలు ఉన్నాయి. ఆల్ఫా కణాలు గ్లుకగాన్ అనే హార్మోన్ ని స్రవింపజేస్తుంది. బీటా కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్ ని స్రవింపజేస్తుంది. డెల్టా కణాలు సొమటోస్టాటిన్ ని స్రవింపజేస్తుంది.

క్లోమము
1: Head of pancreas
2: Uncinate process of pancreas
3: Pancreatic notch
4: Body of pancreas
5: Anterior surface of pancreas
6: Inferior surface of pancreas
7: Superior margin of pancreas
8: Anterior margin of pancreas
9: Inferior margin of pancreas
10: Omental tuber
11: Tail of pancreas
12: Duodenum
గ్రే'స్ subject #251 1199
ధమని inferior pancreaticoduodenal artery, superior pancreaticoduodenal artery
సిర pancreaticoduodenal veins, pancreatic veins
నాడి pancreatic plexus, celiac ganglia, vagus[1]
Precursor pancreatic buds
MeSH Pancreas
Dorlands/Elsevier p_02/

క్లోమాన్ని మొట్టమొదట గ్రీకు అనాటమిస్టు మరియు సర్జన్ హెరోఫిలస్ (335-280 BC) లో గుర్తించాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత మరొక గ్రీకు అనాటమిస్టు రుఫోస్ "pancreas" అనే నామకరణం చేశాడు. గ్రీకు భాషలో pan అంటే "అంతా", మరియు kreas, "మాంసం" అంటే మొత్తం అంతా మెత్తగా ఉండే అవయవం అని అర్థం.[2]

క్లోమ విధులు

క్లోమం ద్విపాత్రాభినయం చేసే అవయవం. దీనిలో వినాళ గ్రంథి మరియు జీర్ణ సంబంధ గ్రంథిగా కలిసి ఉంటాయి.

వినాళ గ్రంథి

వినాళ గ్రంథిగా పనిచేసే క్లోమం లోని మిలియను కణాలన్నింటినీ కలిపి లాంగర్ హాన్స్ పుటికలు అంటారు.[3] వీనిలో నాలుగు రకాల కణాలుంటాయి. వీనిలో ఆల్ఫా కణాలు గ్లూకగాన్, బీటా కణాలు ఇన్సులిన్, డెల్టా కణాలు సొమాటోస్టాటిన్ మరియు PP కణాలు క్లోమ పాలిపెప్టైడ్ లను స్రవిస్తాయి.[4]

ప్రతీ లాంగర్ హాన్స్ పుటికలోను ఈ నాలుగు రకాల కణాలు దగ్గరగా కలిసిఉంటాయి. వీని మధ్య సన్నని రక్తనాళాలు వల లాగా ఏర్పడి ప్రతి కణాన్ని ఆనుకొని ఉండడం మూలంగా వాటి స్రవాలు తిన్నగా రక్తంలోని విడుదల కావడానికి అవకాశం కలుగుతుంది.[5]

జీర్ణ గ్రంథి

క్లోమం లోని జీర్ణ గ్రంథి భాగం వివిధ ఎంజైములను మరియు క్షార ద్రవాలను చిన్న ప్రేగులోనికి క్లోమ నాళాల ద్వారా స్రవిస్తుంది. జీర్ణ సంబంధ ఎంజైములలో ముఖ్యమైనవి ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, లైపేజ్ మరియు ఎమైలేజ్. వీనిని అసినార్ కణాలలో తయారౌతాయి. క్లోమ నాళాలలోని కణాలు బైకార్బనేట్లు మరియు లవణాలు ఎక్కువగా ఉండే ద్రవాల్ని తయారుచేస్తాయి.[6]

వ్యాధులు

క్లోమ క్రోధం

క్లోమము వాపు లేదా క్లోమ క్రోధం లేదా పాంక్రియాటైటిస్ (Pancreatitis) అనేది సాధారణంగా క్లోమ రసాలు బయటకు రాకముందే గ్రంధిలోనే క్రియాశీలమై, తమను ఉత్పత్తి చేసిన క్లోమాన్ని, క్లోమ కణాలను హరించడం వలన కలిగే వ్యాధి. దాని మూలంగా క్లోమం ఆగ్రహించినట్లుగా వాచిపోతుంది. కొన్ని సార్లు ఇది అకస్మాత్తుగా ప్రారంభమై తీవ్రమైన కడుపు నొప్పిని కలిగిస్తుంది. దీనిని 'అక్యూట్ పాంక్రియాటైటిస్' (Acute Pancreatitis) అంటారు. మరికొన్ని సార్లు ఇది క్రమేపీ పెరుగుతూ దీర్ఘకాలం వేదిస్తుంది. దీనిని 'క్రానిక్ పాంక్రియాటైటిస్' (Chronic Pancreatitis) అంటారు.

మధుమేహం

కృత్రిమ తిత్తులు

కృత్రిమ తిత్తులు (Pseudocysts) ద్రవాలు కలిగివున్న తిత్తులు. వీనిలో సాధారణంగా క్లోమపు ఎంజైములు, రక్తం మరియు మృత కణజాలలు ఉంటాయి. ఇవి సామాన్యంగా కడుపులోనే క్లోమ పరిసరాల్లో తయారౌతాయి. ఇవి క్లోమ క్రోధం (pancreatitis) మూలంగా ఎక్కువగా పిల్లలలో కనిపిస్తుంది. ఇవి క్లోమంలోని సుమారు 75% గడ్డలకు కారణం. Pseudo- అంటే లాటిన్ భాషలో "కృత్రిమం" అని అర్థం. నిజమైన తిత్తులలో కణజాలల పొర ఉంటుంది. కృత్రిమ తిత్తులలో ఇది లోపిస్తుంది.

ట్యూమర్లు మరియు కాన్సర్

మూలాలు

  1. Physiology at MCG 6/6ch2/s6ch2_30
  2. Harper, Douglas. "Pancreas". Online Etymology Dictionary. Retrieved 2007-04-04.
  3. Hellman B, Gylfe E, Grapengiesser E, Dansk H, Salehi A (2007). "[Insulin oscillations--clinically important rhythm. Antidiabetics should increase the pulsative component of the insulin release]". Lakartidningen (in Swedish). 104 (32-33): 2236–9. PMID 17822201.
  4. BRS physiology 4th edition ,page 255-256, Linda S. Constanzo, Lippincott publishing
  5. The Body, by Alan E. Nourse, in the Time-Life Science Library Series (op. cit., p. 171.)
  6. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3556: bad argument #1 to 'pairs' (table expected, got nil).
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.