ఉదరము

ఉదరము లేదా కడుపు (Abdomen) మొండెంలోని క్రిందిభాగం. ఇది ఛాతీకి కటిభాగానికి మధ్యలో ఉంటుంది. దీనిని పొట్ట అని కూడా అంటారు.[1] పొట్ట అంటే గర్భం అని కూడా ఒక అర్థం ఉంది. ఇంకో అర్థంలో పొట్ట రావడం అంటే ఉదరం ఉబ్బి ఒక అనారోగాన్ని సూచించడానికి కూడా వాడతారు. స్థూల కాయం వలన కొవ్వు చేరి పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఉదరంలో జీర్ణవ్యవస్థ, మూత్రవ్యవస్థ, మరికొన్ని ఇతర అవయవాలున్నాయి. కాలేయము ఛాతీ క్రిందగా కుడివైపున ఉంటుంది. ఉదరవితానము (డయాఫ్రమ్) అనే కండరం ఛాతీ నుండి దీన్ని వేరుచేస్తుంది. ఉదర కుహరం (Abdominal cavity) ఉదరంలోని వివిధ అవయావాలను కప్పుతూ సీరస్ పొర ఉంటుంది. దీనిలో కొంత ఉదర ద్రవం (Abdominal fluid) ఉండి పేగులవంటివి రాపిడి లేకుండా వీలు కల్పిస్తాయి.

సకశేరుకాలు

ఉదరంలోని అవయవాలు

వ్యాధులు

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.