అస్థిపంజరం

అస్థిపంజర వ్యవస్థ (ఆంగ్లం Skeletal system) శరీర నిర్మాణ శాస్త్రములోని విభాగము. ఇది దేహానికి ఆధారాన్నిచ్చే ధ్రుఢనిర్మాణము. ఇవి దేహానికి వెలుపల ఉంటే వాటిని 'బాహ్య అస్థిపంజరం' (exoskeleton) అనీ, లోపల ఉంటే 'అంతర అస్థిపంజరం' (endoskeleton) అనీ అంటారు. శరీర మధ్యభాగంలోని అంతర అస్థిపంజరాన్ని 'అక్షాస్థి పంజరం' (axial skeleton) అని, వీటికి అనుబంధంగా అతికించబడి ఉన్నదాన్ని 'అనుబంధాస్థి పంజరం' (appendicular skeleton) అని అంటారు. మానవుని శరీరములో 206 ఎముకలుంటాయి.

ఉపయోగాలు

కదలిక

సకశేరుకాలలో శరీర కదలిక కండరాలు ఎముకల సమన్వయంతో జరుగుతుంది.

రక్షణ

  1. కపాలం మెదడు మరియు జ్ఞానేంద్రియాల్ని రక్షిస్తాయి.
  2. పక్కటెముకలు, వెన్నెముకలు మరియు ఉరాస్థి గుండె, ఊపిరితిత్తులు మరియు ముఖ్యమైన రక్తనాళాల్ని రక్షిస్తాయి.
  3. వెన్నెముకలు అన్ని మొత్తంకలసి వెన్నుపామును రక్షిస్తాయి.
  4. కటి వెన్నెముకలు కలసి జీర్ణ, మూత్ర మరియు జననేంద్రియ వ్యవస్థలను రక్షిస్తాయి.

రక్తకణాలు

మూలుగనుండి రక్తంలోని ఎర్ర, తెల్ల రక్తకణాలు తయారవుతాయి.

నిలువచేయుట

కాల్షియమ్ లవణాన్ని నిలువచేసే ముఖ్యమైన అవయవాలు - ఎముకలు.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.